Facebook Twitter
గుప్పెడు మనసు...?

గులాబీలాంటి
గుప్పెడు మనసు
విచ్చుకుంటే
అది పిచ్చిప్రేమే
ముళ్ళులా
గుచ్చుకుంటే
అది పెనుముప్పే
నొచ్చుకుంటే
అది ఘోరమే ప్రతీకారమే

గుప్పెడు మనసుకు
గాయమైతే
దగే దగ పగే పగ
గుప్పెడు మనసులు
ఏకమైతే గుళ్ళో పెళ్ళే
మెళ్ళో తాళే
మనసు మనసు
ఏకమైతే మాంగల్యమే
తనువు ‌తనువు
ఏకమైతే తన్మయత్వమే

అందుకే
మనసుకు ఎప్పుడూ
గాయం చేయకు
మానవత్వాన్ని
ఎన్నడూ మంటగలపకు

ఎవరికి ఎవరు దూరమైనా
అది భారమే ‌అంధకారమే
గూడు చెదరినా
గుండె పగిలినా అది నరకమే
ఇద్దరూ ఏకమైతే
ప్రేమలోకమే అది స్వర్గలోకమే