అడవి బాపిరాజు
కవి కాలేజీ ప్రిన్సిపాల్
నాటక రచయిత సినీ దర్శకుడు
గొప్ప పాత్రికేయుడు
బహుముఖ ప్రజ్ఞాశాలి
సాంఘిక చారిత్రక నవలాకారుడు
జైలు జీవితం గడిపిన
స్వాతంత్ర సమర యోధుడు
విశ్వనాథ సత్యనారాయణ "
కిన్నెరసాని" పాటలకు బహు
సుందరమైన చిత్రాలు
వేసిన చిత్రాకారుడు
ఆయన కుంచె నుంచి వెలువడిన
డెన్మార్క్ లోని "శబ్దబ్రహ్మ",
తిరువాన్కూరు మ్యూజియంలోని
"భాగవత పురుషుడు" "ఆనందతాండవం",
శ్రీలంక లోని అపురూపమైన
"కుడ్య చిత్రాలతో మన తెలుగు జాతి
ఖ్యాతి దేశవిదేశాలలో సజీవంగా వున్నది.
చేయి తిరిగిన చిత్రకారుడు
"అభినవ రవివర్మ" మన అడవిబాపిరాజు
ఆయన కలం నుండి వెలువడిన
నవలలు నాటికలు కధలు కోకొల్లలు
అవి తెలుగు సాహిత్య క్షేత్రంలో
విరబూసిన వాడని కుసుమాలు
తెలుగు సాహిత్య సాంస్కృతిక
సామ్రాజ్యానికి అడవి బాపిరాజు
"మకుటం లేనిమహారాజు"
వారు "బావా బావా పన్నీరు"
పాటను వ్రాశారు ఆంధ్రదేశంలో
ఆబాలగోపాలంఆ పాటను విన్నారు
పాడుకున్నారు పరవశించి పోయారు
వేయిపడగలు నవల రాసిన
విశ్వనాథ సత్యనారాయణ గారితో పోటీపడి
"నారాయణ రావు" సాంఘిక నవల వ్రాసి
ఆంధ్ర విశ్వకళా పరిషత్ నిర్వహించిన
నవలల పోటీలో "750" రూపాయల బహుమతి
గెలుచుకున్న అడవి బాపిరాజు
"సాంఘిక చారిత్రక నవలా చక్రవర్తి"
ఎందరో కవులకు ఆదర్శమూర్తి
తెలుగుసాహిత్య చరిత్రలో
అజరామరం ఆయన అఖండకీర్తి
ఇంతటి "బహుముఖ ప్రజ్ఞాశాలి"యైన
ఈ భీమవరం బుల్లోడు కృష్ణయ్య
సుబ్బమ్మ సుపుత్రుడు
వీరి రచనలకు మరణం లేదు
తెలుగు నేలలో వీరి పేరు శాశ్వతం
తెలుగుజాతి వీరికి ఎంతో ఋణపడి వుంది.
వీరు సదా చిరస్మరణీయులు



