ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో
సరయూ నదీతీరాన...
ఎన్నో వేల ఏళ్ళ క్రితం వెలసిన
అతి సుందరమైన...అతి ప్రాచీనమైన
ఆథ్యాత్మిక నగరం...అయోధ్య నగరం...
అత్యంత పవిత్ర స్థలం..
ఈ శ్రీ రామజన్మభూమి...
హిందువుల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం...
అయోధ్యలోని
రామమందిరంలో స్థంభాలు...392 ఋషులు అందించిన వేదాలు...4
చారిత్రాత్మకమైన
ఈ రామమందిర నిర్మాణానికి
ప్రధానమైన అదృశ్య స్థంభాలు...4
1992 డిసెంబర్ 6 న...
అద్వానీ ఆధ్వర్యంలో జై శ్రీరామ్
నినాదంతో కరసేవకుల చేత...
నాడు..."బాబ్రీ మసీదు కూల్చివేత"...
2019 నవంబర్ 9 న ...
ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో
ఐదుగురు సభ్యుల ధర్మాసనం
ఇచ్చిన..."చారిత్రాత్మకమైన తీర్పు"...
2020 ఆగస్టు 5 న...
శ్రీరామమందిరానికి ప్రధాని
నరేంద్ర మోడీ..."చేసిన శంకుస్థాపన"...
2022 జనవరి 22 న...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీచే...
ఆథ్యాత్మిక నగరం అయోధ్యలో
బాలరాముని విగ్రహానికి
అంగరంగ వైభవంగా...అట్టహాసంగా...
ప్రతిష్టాత్మకంగా..."జరిగిన ప్రాణప్రతిష్ఠ"
నేడు అంతా రామమయం...
అయోధ్య అంతా రామమయం...
కాదు కాదు జగమంతా రామమయం...
జై శ్రీరామ్...జైహింద్...జై భారత్...



