Facebook Twitter
దినదినం… స్మరియించుకుందాం… ఈ దివ్య నవ్య నామాలు..?

ప్రతినిత్యం ప్రభాత వేళలో
దర్శించుకోవాలి దైవాలను...
కరుణా కటాక్ష వీక్షణాలతో
కష్టాల కారుమబ్బులెన్నో
కమ్ముకోగా కాపాడమని...
దయ జాలి చూపమని...
ఆపదలో ఆదుకొమ్మని...

ఆత్మశుద్ధి సద్బుద్ది
సంకల్పం సిద్దిరస్తు...
ఆరోగ్య భోగభాగ్యాలు
సుఖశాంతులు ప్రాప్తిరస్తు...
అంటూ దీవెనలు కుమ్మరించేలా...

ఒక దివ్యమైన...
భవ్యమైన...
దినకర...
శుభకర...
సుందర...
సుమధుర...
మధుర మంజుల...
మనోహర మంగళకర...
నిత్య సత్య నవ్యనామాలు కొన్ని...
దినదినం మనమున స్మరించుకోవాలి...

జై గణేశ...
జైజై బొజ్జ గణేశ...

జై హనుమాన్...
జై శ్రీ ఆంజనేయ...

శరణం శరణం...
ఓం సాయి శరణం...

ఓం నమశ్శివాయ...
ఓం నమశ్శివాయ...
హర హర మహాదేవ...
శంభో శంకర...

హరే కృష్ణ హరే కృష్ణ...
కృష్ణ కృష్ణ హరే హరే...
హరే రామ హరే రామ...
రామ రామ హరే హరే...

శ్రీ శ్రీనివాసా గోవిందా...
శ్రీ వెంకటేశ గోవిందా...
గోవిందా హరి గోవిందా...
గోకుల నందన గోవిందా...

జైశ్రీరామ్...
అంతా రామమయం...
ఈ జగమంతా రామమయం...

ఓం నమో నారాయణాయః...అంటూ...

అనంతమైన భక్తి శ్రద్ధలతో స్మరించిన
ఏ వ్యక్తికైనా ఏ భక్తునికైనా కలుగు ముక్తి
నానావిధ విష సమస్యల నుండి విముక్తి