గుడికి పూజారి...?
ప్రపంచ పోటీకి
సిద్దమైన ఆటగాళ్ళు
ఆటలో రాణించాలంటే..?
కప్పును గెలవాలంటే..?
బంగారు పతకాలు
సాధించాలంటే..?
దేశ కీర్తి పతాకం
క్రీడా మైదానంలో
రెపరెలాడాలంటే..?
విశ్వవిజేలు కావాలంటే..?
తెరవెనుక...
విజయమే ఏకైక లక్ష్యంగా
ఆటగాళ్ళను తగిన శిక్షణ నిచ్చి
యుద్దానికి సిధ్ధం చేసే ఒక
"టాలెంటెడ్ ట్రైనర్ " తప్పక
కావాలి...కావాలి...కావాలి..!
ధూపదీప
ఫలపుష్పాలతో
నిత్యం గుడిలో
పూజలు అర్చనలు
అభిషేకాలు చేయాలంటే..?
శ్లోకాలు పఠించాలంటే..?
మంగళ హారతి పట్టాలంటే..?
గణగణమని గంట కొట్టాలంటే..?
ఆ దైవానికి నైవేద్యం పెట్టాలంటే.?
విగ్రహమై గర్భగుడిలో కూర్చున్న
ఆ దైవం అనుగ్రహం కావాలంటె...
భక్తుని భగవంతునికి
అనుసంధానమైన అగరబత్తీలా
భగవంతునికి ముందు
"గుళ్ళో ఒక పూజారి" తప్పక ఉండాలి...ఉండాలి...ఉండాలి..!



