Facebook Twitter
ఆనందతాండవం చేస్తోంది అయోధ్య

త్రేతాయుగంలో
లోక కల్యాణం కోసం
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం
లంకాధిపతి సంహారం కోసం
ఆ శ్రీమహావిష్ణువే...
ఆదర్శ పురుషుడిగా....
సుగుణాల రాముడిగా...
మర్యాద పురుషోత్తముడిగా...
శ్రీరామచంద్రుడిగా అవతరించినందుకు...

సనాతన ధర్మానికి ప్రతీకగా...
సంక్షేమ రాజ్యానికి సాక్షిగా నిలి asaచి...
తన తండ్రికిచ్చిన మాటకు కట్టుబడి...
14 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన
కోసల రాజైన దశరధునికి కొడుకైన
భక్తులు కోరిన కోర్కెలు తీర్చేటి...ఆ
కోదండరామునికి జన్మనిచ్చినందుకు...

ఆనంద తాండవం చేస్తోంది అయోధ్య
తిలకించి పులకించి పోతోంది అయోధ్య
ఉల్లాసంతో ఉప్పొంగి పోతోంది అయోధ్య
ప్రపంచ శాంతిని ప్రభోదిస్తోంది అయోధ్య
ప్రపంచ ప్రశంసలందుకుంటోంది అయోధ్య
ఆ శ్రీరామచంద్రునికి...
ఆ పరమ పావనమూర్తికి... 
తన గుండెల్లో గుడి కట్ఠినందుకు...
పరవశించి పోతుంది...అయోధ్య...