మేమిద్దరం ప్రేమపక్షులమై
పార్కులంటూ నైట్ పార్టీలంటూ
పబ్బులంటూ క్లబ్బులంటూ
సినిమాలంటూ షికార్లంటూ
బరితెగించి విచ్చలవిడిగా తిరిగాం
తాగి తందనాలాడాం
డ్రగ్స్ కు బానిసలయ్యాం
సిగ్గు లజ్జలేకుండా చిందులేశాం
పగలూరాత్రీ బాగా ఎంజాయ్ చేశాం
చాటింగంటూ బ్రౌసింగంటూ
నెట్టులో పీకలదాక మునిగాం
మాయమాటలతో నన్ను మభ్యపెట్టి
నెట్టు చుట్టూ తిప్పితిప్పి
సెల్లో బూతుకబుర్లు చెప్పిచెప్పి
అద్దరాతిరిలో ముద్దులు అడిగిఅడిగి
నాలో కోటి క్రొత్త ఆశలు రేపిరేపి
అరచేతిలో స్వర్గం చూపిచూపి
మైకంతో ఒళ్ళు మరిచిన వేళ
కామంతో కళ్ళు పొరలు కమ్మినవేళ
పిచ్చి ప్రేమలో పీకలదాక మునిగినవేళ
బరితెగించి వాడితో పిచ్చిగా తిరిగినవేళ
వాడిని పూర్తిగా నమ్మిన వేళ
ఓ పాతపడ్డ గుడి వెనకాల, వాడిఆకలి
తీరిన వేళ వాడి తీరు మారినవేళ
అప్పుడు అర్థమైంది నాకు అయ్యే
ఘోరంగా మోసపోయానని,వాడు
పచ్చి మోసగాడని నమ్మక ద్రోహి అని
ప్రేమికుడుకాదు, కామికుడని
రాముడు కాదు, రాక్షసుడని
కరుణామయుడుకాదు కసాకసా
గొంతులుకోసే కసాయివాడని
కానినేనిప్పుడు
అద్దాలమేడలో వున్నాను
ఎవరిమీద రాళ్ళు విసరలేను
ఔను వాడిని తిట్టలేను కొట్టలేను
వాడి మీద కేసులు పెట్టలేను
వాడి మీద యాసిడ్ దాడి చెయ్యలేను
కారణం నా దగ్గర ఏ ఆధారాలు లేవు
ఇంకావాడి దగ్గరే సెల్లో రికార్డు చేసిన
నా నేకెడ్ ఫోటోలున్నాయి
నాడు అమ్మానాన్నా చెప్పింది వినలేదు
వారిని మోసంచేసి నేను మోసపోయాను
సర్వం వాడికి అర్పించే ముందు
ఒక్క క్షణమైనా అమ్మా నాన్నల
గురించి ఆలోచించివుంటే...
మంచి సలహాలు సూచనలు చేసే నా
క్లోజ్ ఫ్రెండ్స్ కి ఒక్కమాట చెప్పివుంటే...
సభ్య సమాజానికి కాస్త భయపడివుంటే...
ప్రస్తుతం నాకీదుస్థితి దాపురించేది కాదేమో
వాడు నామెడలో తాళి
కట్టక పోయినా పర్వాలేదు
కాని నా నేకెడ్ ఫోటోలు నెట్టులో
పెట్టకపోతే అంతే చాలు
అందుకోసం వాడికాళ్ళయినా
పట్టుకోవడానికి నేను సిద్దం
చేయలేనిక వాడితో యుద్ధం
లేదంటే నాకు ఆత్మహత్యే శరణ్యం
ఇది ఓ అమాయకురాలు ఘోరంగా
మోసపోయి ప్రతిపేజీని ప్రేమతో నింపి
వ్రాసిన తన డైరీలోని "ప్రతిఅక్షరం"
ఆమె అనుభవించిన "మానసిక క్షోభకు"
ఆమెకార్చిన "కన్నీటిధారలకు ప్రతిరూపం"
ఔను పాపం ఆమె ఆరిపోయిన" ఒక ప్రేమదీపం"



