Facebook Twitter
ఎవరుగొప్ప?

అప్పుడెప్పుడో శ్రీశైలంనుండి పెద్ద శిల్పివచ్చాడు
వస్తూవస్తూ తొమ్మిదడుగుల పెద్ద బండను తెచ్చాడు 
ఆరడుగుల కొలత పెట్టి బండను ఖండించాడు
మిగిలిన మూడడుగుల ముక్కను ప్రక్కకు నెట్టాడు

ఆరడుగుల ముక్క ఆంజనేయ విగ్రహమైంది
మూడడుగుల ముక్క చాకిరేవులో బండైంది 
అక్కడ కల్తీ ఆత్మలన్నీగుడి ముందర నిలిచాయి 
ఇక్కడ కంపుకొట్టే బట్టలన్నీ బండరాయి చుట్టూచేరాయి

అక్కడ గొంతెమ్మ కోర్కెల గొంతులన్నీతులసీ తీర్థంతో తడిశాయి
ఇక్కడ మురికి పట్టిన బట్టలన్నీ చాకిరేవులో మునిగి తరించాయి
అక్కడ అర్ధంకాని శ్లోకాలతో పూజారి చేశాడు పూజలు
ఇక్కడ బట్టలుతికే చాకలి ఆకలితో వేశాడు కేకలు

అక్కడ శఠగోపురం పెట్టిన ప్రతితలపూజారి దీవెనలతో పులకరించింది
ఇక్కడ మురికి పట్టిన ప్రతి బట్ట  బండకేసి తనతలను బాదుకుంది
కడకు గుడినుండి కల్తీ ఆత్మలన్నీకంపుతోనే తిరిగి వెళ్లాయికానీ
chaakiరేవునుండి బట్టలన్నీchaalaaఇంపుగా మెరుస్తూ ఇంటికెళ్ళాయి

మీరే చెప్పండి ఏది గొప్పో  
భక్తుల ఆత్మల్ని శుద్దిచేయలేని ఆ ఆరడుగుల బండనా
మురికి బట్టలన్నీ శుభ్రం చేసిన ఈ మూడడుగుల ముక్కనా?