Facebook Twitter
బుద్ద భగవానుడు

కొరడాలతో కొట్టినా
కత్తులతో పొడిచినా
పరుషంగా తిట్టినా
శ్రమలెన్ని పెట్టినా
లెక్కచేయక, 
ఘాటైన ఒక్క
మాటైనా అనకపోగా
సమసమాజం కోసం
ప్రాణత్యాగానికైనా సంసిద్ధం

ఆ సహనశీలిలో లేనికది
ఆ శాంతమూర్తిలో
కాగడా పెట్టి వెతికినా
కానరానిది ఒక్కటే కోపం
ఆ కోపమే, అయ్యో
పాపమనే ఆ తత్వమే
ఆ త్యాగమూర్తి భోగానికి
రాజయోగానికి శాపం
ఆ మహాజ్ఞాని అందించిన
ఆ అమృత సందేశమే
అఖిలజగత్తుకు ఆరనిజ్వోతి

ఆయనే ప్రజలందరికి
అహింసా పాఠాలు నేర్పిన
అమృత మూర్తి
ఆయనే అంటరానితనంపై
ఒంటరిగా, చిత్తశుద్ధితో
పోరుసల్పిన సింహబలుడు
ఆయనే సమానత్వాన్ని
సౌబ్రాతృత్వాన్ని,మానవత్వాన్ని
మన నరనరాన ఇంజక్ట్
చేసిన నర నారాయణుడు
ఆయనే ఈ భువిపై
జన్మించిన బుద్దభగవానుడు