మానవుడే మాధవుడైతే ?
నీవు మెట్టువైతే
నిన్ను త్రొక్కుతారు...!
నీవు గట్టువైతే నీ మీదే
నవ్వుతూ నడుస్తారు...!
నీవు పొట్టువైతే
నిన్ను నిర్దాక్షిణ్యంగా
కాల్చిబూడిద చేస్తారు...!
కానీ నీవు అలసి
సొలసి ఇంటికివొస్తే
ఆకలి తీర్చే ఓ అమ్మవైతే...!
నీవు కమ్మని ఫలాల నిచ్చి
కడుపు నింపే ఓ పచ్చని చెట్టువైతే...!
నీవు గర్భగుడిలో ప్రతిషించబడి
కోరిక కోరికలు తీర్చే
కోటి వరాల వర్షం కురిపించే
సుందరమైన ఓ దేవతా శిల్పమైతే...!
అందరూ నీకు మొక్కుతారు కారణం
నీవు మానవుడి రూపంలో
దర్శనమిచ్చు ఆ మాధవుడివి
ఆపై నిత్యం నీకే
నైవేద్యాలు పూజలు...
అర్చనలు అభిషేకాలు...
ఉత్సవాలు ఊరేగింపులు...
అప్పుడు నీవే దైవం నీ జన్మధన్యం...!



