సంస్కారం...? సంస్కృతి...? సాంప్రదాయం...?
ఎవరైనా ఎప్పుడైనా
మహత్కార్యాను నిర్వహిస్తే
అసాధ్యాలను సుసాధ్యం చేస్తే
అట్టివారి ధైర్యసాహసాలను
కొనియాడాలి నిత్యం వారిని
స్మరించుకోవాలి స్పూర్తిని పొందాలి...
వారికి మనస్పూర్తిగా
"అభినందనలు" అందజేయాలి...
ఆ అభినందనలే వారికి ఆస్తి ఆక్సిజన్
అందుకే...
"ఆ మేధావుల"
మెడలో "పూలమాలలు" వేయాలి...
"ఆ పండితుల"
"పాదపద్మాలకు" నమస్కరించాలి....
స్పూర్తిని మనలో నింపి
సమాజంలోని రుగ్మతలను
రూపుమాపేందుకు నడుంకట్టిన
"ఆ సంఘసంస్కర్తలకు"
"సాష్టాంగ నమస్కారం" చెయ్యాలి...
దేశ సంక్షేమానికి,
సమైక్యతకు, సమగ్రతలకు
తమ నిండుప్రాణాలను ఫణంగాపెట్టిన
"ఆ వీరజవాన్లకు"
నుదుట మనం "రక్తతిలకం" దిద్దాలి...
అదే మన... సంస్కారం...
అదే మన... సంస్కృతి...
అదే మన...సాంప్రదాయం...కావాలి...



