Facebook Twitter
మేరా భారత్ మహాన్... 1

జనగణమన...
వందేమాతరం...
జైజవాన్ జైకిసాన్...
సారే జహాసె అచ్చా ...
మేరా భారత్ మహాన్...
ఇంక్విలాబ్ జిందాబాద్....
అన్న నిప్పులాంటి నినాదాలే
నిత్యం మన గుండెచప్పుళ్ళైతే...
మనలో జాతీయత...హహ
ఆత్మీయత...నిజమైన దేశభక్తి...
సద్భావన స్ఫూర్తి...
నిండుగా ప్రవహిస్తున్నట్లే..!

ఆరని జ్యోతులైన...
అమరవీరులైన
స్వాతంత్ర్య
సమరయోధులను...
దేశభక్తులను....
జాతినేతలు..
స్పూర్తిప్రదాతలైన
రాజ్యాంగ నిర్మాత
బాబా సాహెబ్ అంబేద్కర్
జాతిపిత గాంధీ...నెహ్రూ...
సుభాష్ చంద్రబోస్ లను...
నిత్యం స్మరించుకుంటూవుంటే...
వారి ఆశయాలకంకితమైతే...
మన రక్తంలో సమతా...మమతలు...
నిజమైన దేశభక్తి...
సద్భావన స్ఫూర్తి...
నిండుగా ప్రవహిస్తున్నట్లే..!

ఈ దేశం నాకేమిచ్చిందని
చీకటిలో కూర్చొని చింతించక
ఈ దేశాభ్యుదయానికి నేనేమి చేశానని క్షణమాలోచించమన్న నిస్వార్థపరులైన స్వాతంత్ర్య సమరయోధుల సంఘసంస్కర్తల శుభసందేశాలను
కలనైనా మరవకపోతే...
మన రక్తంలో నీతి..
నిజాయితీ...
నిజమైన దేశభక్తి...
సద్భావన స్ఫూర్తి...
నిండుగా ప్రవహిస్తున్నట్లే..!

మట్టి నుండే మెతుకులు పుట్టించే మట్టిమనిషి రైతన్న నోట్లో
నూతన సాగుచట్టాలతో
మట్టికొట్టకపోతే...
మన పాలకుల్లో మంచితనం...
మానవత్వం
నిజమైన దేశభక్తి...
సద్భావన స్ఫూర్తి...
నిండుగా ప్రవహిస్తున్నట్లే..!

కులం కుళ్ళని...
మతం ముళ్ళని గ్రహించి
కులం రొచ్చులో కూరుకుపోక మతంమత్తులో ఉన్మాదులై
మతం చిచ్చు రగిలించకపోతే...
మారణహోమాలు సృష్టించకపోతే...
మన రక్తంలో సహనం...
సమానత్వం సౌభ్రాతృత్వం
నిజమైన దేశభక్తి.....
సద్భావన స్ఫూర్తి...షషష
నిండుగా ప్రవహిస్తున్నట్లే..!