Facebook Twitter
ప్రకృతే పగబడితే - నరుడి బ్రతుకు నరకమే!

కెవ్వుమన్న కేక విన్న - తల్లిదండ్రి తన్మయత్వం చెందేరా 

కన్ను మూశాక కట్టై రగిలేరా -  మనిషి మట్టై మిగిలేరా 

జగతిలో ఎంతకూ అంతుచిక్కనివి -  జననమరణాలేరా 

అన్న పోలన్న సుభాషితం - విన్న మీకు శుభోదయం

లక్షలు లక్షలు ఆర్జించి - లాకర్ లో భద్రంగా పెట్టినా

కోట్లు కోట్లు ఖర్చుచేసి - కొంపలు కట్టినా,నీ ప్రాణమైన

చివరికి నీచేతిలోని సెల్ ఫోన్ కూడా - నీ వెంటరాదురా 

అన్న పోలన్న సుభాషితం - విన్న మీకు శుభోదయం

ఆస్తులెన్నో ఆర్జించినా - ఆకాశాన విహరించినా

సుందర గ్రానైట్ భవనాల్లో- సుఖంగా శయనించినా 

కడకు కాటికి నీ పయనం - ఖాళీచేతులతోనే గదరా 

అన్న పోలన్న సుభాషితం - విన్న మీకు శుభోదయం

కలవాడైనా కడుపేదైనా కడకు - కన్నుమూసి, కట్టై 

కాలవలసిందేరా - మళ్లీ తిరిగి మట్టైపోవాల్సిందేరా 

సుందరస్వప్నం కాదురా జీవితం - సుడిగాలిలో దీపంరా 

అన్న పోలన్న సుభాషితం - విన్న మీకు శుభోదయం

గ్రహాలను గాలించినా - చంద్రమండలాన్ని ఛేదించినా 

గుండెలనుమార్చినా - టెస్ట్ ట్యూబ్ బేబీలనే సృష్టించినా 

గాలిలో కెగిరే ప్రాణానికి - గాలం వేసే వాడెవ్వడురా ?

అన్న పోలన్న సుభాషితం - విన్న మీకు శుభోదయం

లేడురా చచ్చి బ్రతికిన వాడు -  తిరిగి లేచిన వాడు 

లేడురా లేడురా స్వర్గనరకాలు - చూసి వచ్చినవాడు 

మట్టిలో కలిసే ఈ మనిషికి - మరోజన్మ ఎక్కడిదిరా ?

అన్న పోలన్న సుభాషితం - విన్న మీకు శుభోదయం

లెక్కపెట్టగవచ్చు - నింగిలోని చుక్కల్ని నీటిబిందువుల్ని

లెక్కపెట్టగవచ్చు - చెట్టులో ఆకుల్ని జుట్టులో వెంట్రుకల్ని 

జనానికి అర్థంకానివి - ఈ జగతిలో జననం మరణాలేరా

అన్న పోలన్న సుభాషితం - విన్న మీకు శుభోదయం

సముద్రాలు ఇంకిపోయి - చుక్కలే రాలిపోయి,సూర్య 

చంద్రులే గతితప్పిన - సృష్టేలేదురా అంతా శూన్యమేరా 

ప్రకృతే పగబడితే - ఇకనరుడి బ్రతుకు నరకమేరా 

అన్న పోలన్న సుభాషితం - విన్న మీకు శుభోదయం