సూత్రధారి ? పాత్రదారి ?
చావు పుట్టుకల
మధ్య ఎవ్వరికీ
ఎప్పటికీ ఎంతకూ
అంతుచిక్కని ఒక
చిన్నజీవితాన్ని పెట్టి
నీకు నాకు
నిలకడేలేని
మనసు నిచ్చి
మోయలేని
బరువు బాధ్యతల నిచ్చి
ఎన్నో ఎన్నెన్నో ముగింపేలేని
నాటకాలాడుతూ ఉన్నాడు
కంటికీ కనపడని...ఆ పరమాత్మ
నిన్న...నీవు అగాధంలో...
అథఃపాతాళంలో...అంధకారంలో...
నేడు...ఓ హిమగిరి శిఖరం పైన...
వెచ్చని వెన్నెల వెలుగుల్లో...
నిన్న... నీ జీవితం...
ఎండిన బీడు...వాడిన మోడు
నేడు...పండిన ఓ పచ్చని చెట్టు
నిన్న...నీవు బిక్షగాడివి నేడు..బిల్ గేట్స్ వి
తెగిపోని బందాలతో...అనుబంధాలతో
మనల్ని "కీలుబొమ్మలను" చేసి ఆడిస్తున్నాడు
ఈ సర్వజగతికి ఆయనే సృష్టికర్త...సూత్రధారి
ఆజగన్నాటకంలో కేవలం నీవొక...విచిత్ర పాత్రదారి



