Facebook Twitter
నేనింతవరకు చూడలేదు
  • నీరులేని ఏరు దాటాను
    ఎండమావుల్లో నీరు తాగి
    దాహం తీర్చుకున్నాను
    నీకోసం ఎదురుచూసి ఎదురుచూసి
    గూటిలో గువ్వలా గురక పెట్టి
    గాఢనిద్రలోకి జారిపోయాను
     
    లేచి కొండపైకూర్చున్న నా
    గుండెలో మర ఫిరంగులు మోగాయి
    ఆకాశం నుండి చుక్కలు రాలిపడ్డాయి
    కొండ కింద ఉన్న గుడిలో
    గుడ్లు పెట్టిన గుడ్లగూబ పిల్లల్నికన్నది
    చెట్టుమీది కాకులన్నీ పెళ్లికి పిలిచాయి

    గుడ్లగూబ గుర్రుగా చూసింది
    కొంగలు కోయిలలై కూశాయి
    చిలుకలు చిందులేశాయి
    విందు చేసుకున్నాయి
    నెమళ్ళు పించములు
    విప్పి పిచ్చిగా నాట్యమాడాయి
    పావురాళ్ళు పకపకమని నవ్వాయి

    ఏమైంది ఏమో అడవిలో
    విందు ఆరగించి వింతగా
    జంతువులన్నీ వీధికుక్కల్లా
    నామీద విరుచుకుపడ్డాయి
    ఇంత వింత ప్రకృతిని
    నేనింతవరకు చూడలేదు