ఓ మైడియర్ లైఫ్ ప్లానర్
పాలసీ పాలసీ అంటూ
పాట పాడి ప్రయోజనం లేదు
జీవితంలో అలిసిపోయిన
ముసలివాళ్ళలా ముసుగేసుకొని మూలనకూర్చుంటే ప్రయోజనం లేదు
అతిగా ఆలోచించడం వేస్ట్
ప్రతిరోజు ఒక కొత్తవ్యక్తిని
కలవడం ది బెస్ట్
ఫోనుమీద ఫోను కొట్టాలి
ప్రతి కస్టమర్ తలుపు తట్టాలి
పాము చచ్చేదాకా
దెబ్బమీద దెబ్బ కొట్టాలి
పాలసీ దొరికేదాకా పగలు రాత్రి
పరుగులు పెట్టాలి
పడుకుంటే పనులుకావు
వేటగాడిలా జింకపిల్ల కోసం గురిచూసి
బాణం మీద బాణం వెయ్యాలి
చెట్టునుండి పండు రాలేదాక
ఓపికతో రాయిమీద రాయి విసరాలి
బాక్సింగులో విజేతకావాలంటే ప్రత్యర్థిని
ఊపిరాడనియ్యకండా ముక్కుమీదే
పంచ్ మీద పంచ్ కొట్టాలి
పులిలా మనం పరుగుపెట్టకపోతే జింకలు దొరికినట్టే దొరికి చిక్కినట్టేచిక్కీ
తప్పించుకుపోతాయి
అందుకే నీవు నిద్రపోకు
కస్టమర్స్ ని నిద్ర పోనియ్యకు
ఏమనుకుంటారోనని నీకునీవే ముందే ఊహించుకుంటే ముందుకెళ్ళలేవు
రేపు ఎల్లుండి ఉదయం సాయంకాలం
అమావాస్య పౌర్ణమి అంటూ వాయిదాలు మీద వాయిదాలు వెయ్యకు
అతిగా ఆలోచించి ఆలస్యం చెయ్యకు
ఈరోజే ఇప్పుడే ఈ నిముషమే నీది
అది శుభాలనొసగే శుభముహూర్తం
పాలసీలు రాలేదని వ్యధ చెందకు
పక్కా ప్రణాళికతో పద ముందుకు
ఎందుకు?
పండే పాలసీల పంటను కోసేందుకు



