Part - 1
ఇన్సూరెన్స్ కంపెనీల గురించి ఏ అవగానేలేని ఎల్లయ్య ఇన్సూరెన్స్ పాలసీల గురించి ఏమీఎరుగని పుల్లయ్య ఇద్దరు ప్రాణస్నేహితులు. ఒకరోజు ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఆనంద్ బజారులో ఎల్లయ్య ఎదురైతే ఇన్సూరెన్స్ చెయ్యమని అడిగాడు
ఓకే చేస్తే మరి నాకేటి లాభం? అని ఎల్లయ్య ఎదురుప్రశ్న వేశాడు
అప్పుడు అడ్వైజర్
మీకు జరగరానిదేదైనా జరిగితే...
అంటే..?
ఏదైనా...రోడ్డు ప్రమాదం జరిగితే...మీ కుటుంబం... రోడ్డున పడకుండా వుంటుందని...
అంటే..?
ప్రమాదమంటే ఐ మీన్ ఏదైనా బస్ గాని లారి గాని గుద్ది...నే పోతాననేగా మీరనేది..నో నెవర్ అది జరగనేజరగదు ఎందుకంటే... అంటూ పెద్దగా విరగబడి నవ్వుతూ...
ఏరా పుల్లయ్య బస్ గుద్ది మనం పోతామంట బల్లగుద్ది మరీ చెప్పు నిన్న మనకు రామచిలక యేమి చెప్పిందో వీరికి కాస్త... వివపరించు అన్నాడు ఎల్లయ్య
వెంటనే పుల్లయ్య "ఇదిగో అడ్వైజరూ
వీడు ఒక వంద సంవత్సరాలు నేను ఒక వంద సంవత్సరాలు ఇద్దరం కలిపి రెండు వందల సంవత్సరాలు బ్రతుకుతామని నిన్ననే చెట్టు కింద రామచిలుక మాకు చెప్పింది
అందుకే...మేము ఇప్పుడే యెక్కడికి పోం. మాకేమి కాదు.వంద సంవత్సరాలు మేము ఖచ్చితంగా బ్రతుకుతాం, చిలుక... రామచిలుక చెప్పిందయ్యా మాకు అందుకని మా ఇద్దరికి ఏ ఇన్సూరెన్సు అక్కర్లేదు ఓకే అన్నాడు పిచ్చి పుల్లయ్య. అంతేకాదు వారు ఇన్సూరెన్స్ చెేసుకోకపోగా అడ్వైజర్ని ఎగతాళి చేశారు వెళ్ళు వెళ్లవయ్యా అంటూ వెకిలినవ్వులు నవ్వారు
Part - 2
ఔను మంచి చెబితే ఎవరూ వినరు
కాని విన్న వారు, పాలసీ చేసుకున్న వారు, ఇప్పుడు కాదు రిగ్యులర్ రిటర్న్ ప్రతిసంవత్సరం బ్యాంకుఖాతాలో పడుతున్నప్పుడు...ఏదైనా జరిగి లక్షలు కోట్లు చేతికి అందినప్పుడు...అప్పుడు ఈ అడ్వైజర్ లు కనిపిస్తే చాలు కాళ్ళకు మొక్కాలనుకుంటారు, అనుకుంటూ గొనుక్కుంటూ బాధపడుతూ ఆనంద్ వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత ఆ ఇద్దరు ఇన్సూరెన్స్ కంపెనీల మీద, ఏజెంట్ల మీద కుళ్ళు జోకులేసుకుంటూ ప్రక్కనున్న కల్లు దుఖాణంలోకి దూరి ఫుల్లుగా కల్లు త్రాగి తూలుతూ రోడ్డుకు అడ్డంగా వెళుతుంటే వెనుక నుండి వేగంగా ఒక ఇసుక లారివచ్చి గుద్దింది.
అంతే ఆపై గాయాల పాలై ఆసుపత్రిలో కొనవూపిరితో కొట్టుమిట్టాడిన ఎల్లయ్య పుల్లయ్య లిద్దరు ఇచ్చిన ఆఖరి సందేశం ఏమంటే..
"ఎవరికి ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు ఆ దేవుడికి తప్ప
అందుకే ఓ మిత్రులారా!
మేము చేసిన తప్పులు మీరు చేయకండి
అడ్వైజర్ లు చెప్పే మంచి మాటలు వినండి ఇచ్చే విలువైన సలహాలు స్వీకరించండి
తక్షణమే ఇన్సూరెన్సు చేసుకోండి
మీరుండగానే మీ కుటుంబ సభ్యులందరికి తగిన ఆర్థిక రక్షణ కల్పించుకోండి
మీ కుటుంబాలను మీరు కాపాడుకోండి
ఇదే మా ఆఖరి ప్రార్ధన....
ఇదే మీ అందరికీ మా ఆత్మ సందేశం...



