Facebook Twitter
అన్నకు వందనం అభివందనం

నిన్నటి మన శతృవులే
నేటి మన స్నేహితులు
నేటి మన  స్నేహితులే
రేపటి మన ప్రాణ మిత్రులు
అంటూ కమ్మగా పలికిన
స్నేహానికి చిరునామా ఐన
ఓ అన్నా మీకు వందనం
మీ శుభ సందేశానికి అభివందనం

మంచితనమే మన ఆయుధం
సమానత్వమే మన ఆశయం
సంతోషమే మన సంపద
స్నేహమే మన శక్తి
కలుపుగోలుతనమే మన బలం
అంటూ వివేకానందలా పలికిన
మంచితనానికి మారుపేరైన
ఓ అన్నా మీకు వందనం
మీ శుభ సందేశానికి అభివందనం

పరులనుండి పైసా ఆశించక
మనస్ఫూర్తిగా సేవ చెయ్యాలి
కష్టాలలోవున్న వారిని
తక్షణమే ఆదుకోవాలి
హృదయపూర్వకంగా
చేయగలిగినంత
సహాయం చేయాలి
నేనున్నానన్న భరోసా నివ్వాలి
అంటూ క్రీస్తులా పలికిన
ప్రేమకు ప్రతిరూమైన
ఓ అన్నా మీకు వందనం
మీ శుభ సందేశానికి అభివందనం

పేదల్ని ప్రేమించాలి
పెద్దల్ని గౌరవించాలి
చిన్నవారిని ఆత్మీయంగా
పలకరించాలి
అజ్ఞానులకు బోధించాలి
అమాయకులకు
కనువిప్పు కలిగించాలి
ఓడిపోయిన వారిని ఓదార్చాలి
పడిపోయిన వారిని పైకి లేపాలి
శక్తి హీనులను చైతన్య పరచాలి
అంటూ జ్ఞానబోధ చేసిన
అంబేద్కర్ వీరాభిమానిఐన
ఓ అన్నా మీకు వందనం
మీ శుభ సందేశానికి అభివందనం