Facebook Twitter
ఎవడు? ఎవడు ?

ఎవడు అబద్దాలకోరో
ఎవడు పాపిష్టివాడో
ఎవడు కోపిష్టివాడో
ఎవడు పరమ ఆశబోతో
ఎవడు నమ్మినవారిని
నట్టేటముంచే నయవంచకుడో
ఎవడు పచ్చిమోసగాడో
ఎవడు అరచేతిలో స్వర్గం చూపిస్తాడో
ఎవడు మాయమాటల మాంత్రికుడో
ఎవడు మందినోట్లో
మట్టికొట్టి అన్యాయంగా డబ్బును దోచుకుంటాడో
బ్యాంకులో భద్రంగా దాచుకుంటాడో
అట్టివాడి దుష్టక్రియలన్నీ
ఒకరోజు బట్టబయలుకాక తప్పదు
అట్టివాడికి గజ్జికుక్క కూడ గౌరవమివ్వదు
అట్టివాడికి ఆ దైవం కూడా
ఏదో ఒకరోజు కళ్ళు బైర్లుకమ్మేలా
ఖఠినమైన ఘోరమైన శిక్షలు విధిస్తాడు
దిమ్మ తిరిగేలా చేస్తాడు
వాడు దిక్కులేని కుక్కచావు ఛస్తాడు
వాడు ఛస్తే ఇంటివారు సైతం కంటనీరు పెట్టుకోరు
పిలిచినాసరే కాకులు వాడి పిండాన్ని ముట్టుకోవు