మహా పండితుడు
జ్ఞానవంతుడు మహా మేధావి
విధేయుడైన మహామంత్రి ప్రక్కనే వుంటే
ఏ రాజైనా వీరుడే శూరుడే విక్రమార్కుడే
పూజారే లేకున్నా గుడిలో పూజలు చేయకున్నా
దైవానికి హారతి పట్టేదెవరు? నైవేద్యం పెట్టేదెవరు?
టాలెంటెడ్ ట్రైనర్ లేకుండా తగిన శిక్షణ లేకుండా
పోటీలో పాల్గొన్న ఆటగాడికి విజయమెక్కడిది?
రాజు బలవంతుడే శక్తిమంతుడే
బహు పరాక్రమశాలియే కాని
తన బద్దశత్రువు బలాన్ని బలహీనతల్ని
ఎత్తుల్ని వ్యూహలను కుట్రలను కుతంత్రాలను
అంచనా వేయగలిగినవాడే మహామంత్రి
బలమైన శతృసైన్యం హఠాత్తుగా
నాలుగువైపుల నుండి దాడి చేస్తే
సైనుకుల్ని ఏమార్చి హతమార్చి
రాజమందిరంలోకి చొరబడి తన
ప్రాణానికి ప్రాణమైన మహారాణినినే చెరపడితే
రాజ్యాన్ని ఆక్రమిస్తే ఆస్తుల్ని కొల్లగొడితే
ఎన్ని ఆయుధాలన్నా ఎంత సైన్యమున్నా
ఏ రాజైనా చేయగలిగేది ఏముంది?
కుమిలిపోవడమో కృంగిపోవడమో
ఆత్మహత్యకు పాల్పడడమో
శతృవుకు లొంగిపోవడమో తప్ప
అందుకే ఏ క్షణాన్నైనా యుద్దభేరి మ్రోగించే
శతృసైన్యాన్ని, ఎదిరించాలన్నా, ఎదిరించి
యుద్ధంలో ఘనవిజయాన్ని సాధించాలన్నా
ఏ రాజుకైనా మహామంత్రి వుండాలి అండగా
రాజనీతిలో ఆరితేరిన అపర చాణిక్యుడిలా
అర్జునుడికి కురుక్షేత్రంలో రథసారధి శ్రీకృష్ణుడిలా



