Facebook Twitter
భారత రాజ్యాంగం..! ఒక స్వర్ణ దేవాలయం..!!

ఎందరెందరో...
దేశభక్తుల నిస్వార్థ పరుల...
స్వాతంత్ర్య సమర యోధుల...
జాతినేతల జైలు జీవితాలకు...
ప్రాణత్యాగాలకు...బలిదానాలకు...
పోరాటాలకు...ఉద్యమాలకు...
రక్తతర్పణలకు...ప్రతిఫలంగా...

200 సంవత్సరాల బ్రిటిష్ వారి
దమనకాండ నుండి...
దాస్యశృంఖలాల నుండి...
భారతమాత విముక్తి పొందిన... భారతీయులందరూ
స్వేచ్చా వాయువులు పీల్చిన...
ఎర్రకోటపై త్రివర్ణ పతాకం
రెపరెపలాడిన...దేశచరిత్రలో
సువర్ణాక్షరాలతో లిఖించిన...
శుభదినం...1947 ఆగస్ట్ 15...

జ్ఞానసూర్యుడు అపరమేధావి...
అనేక దేశాల రాజ్యాంగాలను
లోతుగా అధ్యయనం చేసిన
సకల శాస్త్రాలను ఔపాసన పట్టిన
బహుముఖ ప్రజ్ఞాశాలి...
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్...
తన రక్తాన్ని స్వేదంగా మార్చి...
తన ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి...

ముందుచూపుతో పటిష్టమైన
ప్రజాస్వామ్య పునాదులపై
2 సంవత్సరాల 11 నెలల
18 రోజుల్లో నిర్మించిన...
"స్వర్ణ దేవాలయం"...
మన భారత రాజ్యాంగం...

భారత రాజ్యాంమంటే..?
సర్వసత్తాక...సార్వభౌమ...
సామ్యవాద...ప్రజాస్వామ్య...
లౌకిక...గణతంత్ర రాజ్యం...

భారత రాజ్యాంమంటే..?
395 ఆర్టికల్స్ 8 షెడ్యూల్స్
22 భాగాల "జ్ఞాన భాండాగారం"...

భారత రాజ్యాంమంటే..?
న్యాయం...ధర్మం...సత్యం...
స్వేచ్చా...స్వాతంత్ర్యాలు...
సహనం...
సమానత్వం...
సౌభ్రాతృత్వం...
ప్రాధమిక సూత్రాల...
పౌర హక్కుల...రక్షణ కవచం"

ప్రపంచంలోనే అతి పెద్ద
లిఖిత రాజ్యాంగానికి
భారత రాజ్యాంగ పరిషత్
ఆమోదముద్ర పడిన అమృత
ఘడియ...1949 నవంబర్ 26...
"అంబేద్కర్ రాజ్యాంగం" అమలులోకి
వచ్చిన శుభదినం...1950 జనవరి 26.....

75 సంవత్సరాల
సుధీర్ఘ ప్రస్థానంలో
చీకటి గాధలు
కన్నీటి వ్యధలు
ఎన్నో ఎన్నెన్నో
రేపటి రోజైనా...
యుద్దాలు రాని...
రక్తపాతాలు లేని...
రాజకీయ అస్థిరత...
కులాల కుమ్ములాటలు...
మతోన్మాద మతకల్లోలాలు
మారణహోమాలు చూడని...
"అవినీతి జలగలుగా" మారని...
అధికారులతో ప్రభుత్వ పాలకులతో...

కార్పోరేట్ శక్తుల కబంధ హస్తాల్లో
"కీలుబొమ్మలు" కాని ప్రభుత్వాలతో...
"ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని"...ఆశిద్దాం...
ప్రజలంతా...ప్రశాంతంగా...
సుఖశాంతులతో...సురక్షితంగా
జీవించాలని మనసారా కోరుకుందాం...
అందరికీ రాజ్యాంగ మరియు
జాతీయ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు