Facebook Twitter
.(వి) చిత్రమైన చిట్కా??? 

పెళ్లికాని పిల్లలు పెళ్లికాని పిల్లలతో 

తిరిగితేనే పెళ్లవుతుంది 

 

అదెలాగంటే..... 

పెళ్లికాని అమ్మాయిలు తాము 

కళ్ళు మూస్తే చాలు కల్లో కొచ్చి

రాత్రంతా కవ్వించే ఆ రాకుమారుడు 

గిలిగింతలు పెట్టే ఆ గ్రీకువీరుడు 

తమ కళ్ళముందే ప్రత్యక్షమవ్వాలని 

గుళ్ళు గోపురాలు తిరుగుతూ

భక్తితో ప్రతినిత్యం పూజలు చేస్తూ

వేయిదేవుళ్ళకు మొక్కుకుంటూ ఉంటారు

 కమ్మని కలలు కంటూఉంటారు 

ఒక శుభముహూర్తములో కోరుకున్నవాడినే 

కొంగున ముడి వేసుకుంటారు 

 

కాని పెళ్లికాని పిల్లలు పెళ్ళైన వారితో 

(చివరికి సొంత తల్లితోనైనా సరే) తిరిగితే పెళ్లికాదు 

 

కారణం 

పెళ్లైన ప్రతివారు 

ఈ మగవాళ్లంతా శాడిస్టులని 

ఈ సంసారమొక ఒక సాగరమని 

కుటుంబమంటే ఆరని కుంపటని 

పిల్లల పెంపకం ఒక బరువని బాధ్యతని

చచ్చేవరకు అడ్డమైన వారందరికి గొడ్డుచాకిరి చెయ్యాలని 

అసలు పెళ్ళంటేనే ఒక ప్రత్యక్ష నరకమని నూరిపోస్తారు 

 

అది విన్న ఈ పెళ్లికాని పిల్లలకు 

పెళ్లంటేనే విరక్తి పుడుతుంది 

ఆపై ఎన్ని సంబంధాలు తెచ్చినా 

పెళ్ళికి ఒప్పుకోరు పెళ్లి చేసుకోరు అందుకే వారికి పెళ్లి కాదు 

 

అవునంటారా? కాదంటారా? 

మరి మీరే మంటారు?