Facebook Twitter
గానగంధర్వుడికి ఘనమైన నివాళి...

మర్యాద రామన్న సినిమాతో ప్రారంభించి
16 భాషల్లో 40 వేల పాటలు పాడి పలాస
సినిమాతో సంగీత ప్రయాణాన్ని ముగించిన
గానగంధర్వుడు మన SP బాలసుబ్రహ్మణ్యం

పాడుతా తియ్యగా లాంటి
ఎన్నో టీవీషోలను నిర్వహించి
అందరి మన్ననలు పొందినవాడు
విశిష్టమైన వ్యక్తిత్వం గల"వినోదాలరేడు"

కంటికి కనిపించిన ప్రతివారిని
చెదరని చిరునవ్వుతో ఎంతో
ఆప్యాయతతో ప్రేమతో పలకరించే
మంచి మనసున్న "మహనీయుడు"

ఆయన నడిచే ఒక విశ్వవిద్యాలయం
ఏవేడుకకైనా ఏ వేదికైనా ఏ సంగీతసభకైనా
ఆయన నిండుదనం ఒక "అట్రాక్షన్"
పాల్గొన్న ప్రతి ఈవెంట్ లో ఎన్నో చక్కని
మధురమైన పాటలను జనరంజకంగా పాడి

ఆబాలగోపాలాన్ని అలరించే"గానగంధర్వుడు"

అనేక నిజజీవిత నిత్యసత్యసందేశాలను
అందించే కాషాయ వస్త్రాలు ధరించని
ఒక "ఆధ్యాత్మిక గురువు" మన బాలు

ఎందరో ఔత్సాహిక గాయనీగాయకులను
చలన చిత్రసీమకు పరిచయం చేసిన
"ప్రేమమూర్తి"అందరికీ "దైవసమానుడు"

"శంకరాభరణం"చిత్రంలోని పాటకు
జాతీయ పురస్కారాన్ని పొందినవాడు
"పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత"
గానగంధర్వుడు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం

ఖరీదైన తన ఇంటిని కంచిమఠానికి
విరాళంగా ఇచ్చిన "గొప్పదాత"
"ఉదారస్వభావి "నిగర్వి" "నిర్మలమూర్తి"

1946 సంవత్సరంలో నెల్లూరులో జన్మించి
75 సంవత్సరాల తన జీవితాన్ని
సంగీతసాధనకే చిత్రసీమకే అంకితం చేసి
అమరగాయకుడు ఘంటసాలనే మరిపించి
కొన్ని దశాబ్దాలు దక్షిణభారత చలనచిత్ర
సంగీత సామ్రాజ్యాన్ని ఏకధాటిగా ఏలిన
"మకుటంలేని మహారాజు"మధురగాయకుడు

ఎందరో నటులకు గాత్రదానం చేసిన
"డబ్బింగ్ ఆర్టిస్టు" సినీ నిర్మాత"
గానగంధర్వుడు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం

48 రోజులు కరోనాతో పోరాడి పోరాడి
ఓడిపోయి అమరుడాయె గానగంధర్వుడు
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం
ఆయన ఆత్మకుశాంతి చేకూరాలని కోరుతూ
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం
తెలియజేస్తూ అశృనయనాలతో
అందిస్తున్న "ఘనమైన అక్షరనివాళి"...