Facebook Twitter
బాపూజీ కన్నకలలు?

నాడుతెల్లదొరలను తరిమిన 

తెల్లపావురాలు మనం 

శాంతి కపోతాలు మనం

అహింసే ఆయుధంగా 

జాతిపిత బాపూజీ ఆధ్వర్యంలో 

సమరయోధుల సంఘసంస్కర్తల 

ఎందరో దేశభక్తుల రక్తతర్పణ 

ప్రతిఫలమే మన స్వాతంత్రం కానీ 

ఎక్కడ స్వాతంత్రం ?ఎక్కడ స్వేచ్ఛ ?

ఎక్కడ సమానత్వం ? ఎక్కడ సౌభ్రాతృత్వం?

ఆడది అర్థరాత్రిలో నిర్భయంగా స్వేచ్ఛగా

తిరిగినాడే దేశప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం

అన్న బాపూజీ కన్నకలలు కల్లలయ్యాయి

ఎక్కడ చూసినా అరాచకాలు అక్రమాలు 

దోపిడీలు దొంగతనాలు లంచగొండితనం 

రాజకీయరంగంలో అగ్రస్థానంలో అవినీతి

నీతి నిజాయితీ నైతిక విలువలు 

నేడు కారు చీకటిలో కాంతిరేఖలు 

నాడు ప్రజల హక్కులను కాలరాసిన 

నిరంకుశ ప్రభువులు రాజులు 

చెట్టుమీద పిట్టల్లా రాలిపోయారు

రాజ్యాలు ఎండుటాకుల్లా రాలిపోయాయి

కాలగర్భంలో కలిసిపోయాయి 

నేటి నల్లత్రాచుల భరతం పట్టడం 

ప్రతిపౌరుని బాధ్యత

ఓటు విలువ తెలుసు కోవాలి

నిస్వార్థపరులైన నాయకులను ఎన్నుకోవాలి 

ఓర్పు నశించి ఓటర్లు ఆగ్రహిస్తే 

కళ్ళముందరే ఎంతటి ప్రభుత్వాలైనా 

రెప్పపాటు కుప్పకూలిపోతాయి 

అందుకే నీతిగా నిజాయితీగా బ్రతకాలి 

స్వాతంత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని 

దేశఔన్నత్యం దశదిశలా విస్తరించేలా 

ప్రపంచదేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్యశక్తిగా 

విరాజిల్లే మన భారతదేశ రక్షణ కోసం 

వీరసైనికుల్లా పోరాడడం ప్రతిపౌరుని "బాధ్యత" 

ఈ స్వాతంత్ర్య స్ఫూర్తితో జగతికి జీవంపోద్దాం !

భారతదేశ ప్రగతి రథచక్రాలను పరుగులు పెట్టిద్దాం