కరోనా నేర్పిన గుణపాఠం
కరోనా వచ్చింది
కష్టాలు తెచ్చింది
ఎవరికి ?
ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ
కరోనా వచ్చింది
కన్నీళ్ళు తెచ్చింది
ఎవరికి ?
కడచూపైనా దక్కనివారికి
కరోనా వచ్చింది
కంటికి కునుకులేకుండా చేసింది
ఎవరికి?
కరోనా పోరులోని వైద్య సిబ్బందికి
కరోనా వచ్చింది
కనువిప్పు కలిగించింది
ఎవరికీ?
పోయే ప్రాణాన్ని కోట్లు
పోసైనా కొనగలమనుకున్నవారికి
కరోనా వచ్చింది
గొప్ప గుణపాఠం నేర్పింది
ఎవరికి ?
వారు తక్కువ
మేమెక్కువని విర్రవీగే వెర్రివారికి
అంతా నిజమే
కాని కరోనా వచ్చింది
బంధాలను నిలబెట్టింది
భార్యాభర్తలు మధ్య
బంధువులందరి మధ్య,
కరోనా వచ్చింది
మంచి సందేశాన్నిచ్చింది
ఏమని?
కాలం కోహినూర్ వజ్రమని
ఖరీదైనదని, కొనలేనిదని
ప్రాణం విలువ కట్టలేనిదని
జీవితం ఒక నీటిబుడగని



