కరోనా రక్కసిని ఖతం చేద్దాం…
కరోనా వచ్చింది
కష్టాలను తెచ్చింది
ఈ కనిపించని కరోనాతో
అంత అయోమయం
ఈ కరుణలేని కరోనాతో
అంతా అగమ్యగోచరం
ఈ కరోనా వ్యాధి సోకితే
బ్రతుకంతా అంధకారం
ఈ కరోనా రక్కసితో
ప్రతి కంట్లో కన్నీరే
ప్రతి ఇంట్లో విషాదమే
ప్రతి ఒంట్లో మృత్యుభయమే
ఈ కరోనా విషక్రిమితో
విశ్వమంతా ఊహించని విపత్తే
కబలించే ఈ కరోనాతో
శ్మశానాలలో శవాల గుట్టలే
ఈ కరోనా కాలనాగు కాటుకు
జనాలు రాలిపోతున్న పిట్టలే
విశ్వమంతా విస్తుపోతోంది
విశ్వప్రయత్నాలు చేస్తోంది
మందు కొనుగొని మట్టు పెట్టడానికి
కరోనా రక్కసిని ఖతం చేయ్యడానికి



