కరోనా నేర్పిన కఠోర సత్యం....
కరోనా వచ్చింది
సామాజిక సమానత్వం
సౌభ్రాతృత్వం స్వేచ్ఛా
స్వాతంత్ర్యాలకు ప్రాణం పోసింది
కరోనా రాకతో
మంచితనం,త్యాగగుణం
మరిచిపోలేని,మానవత్వం
మనిషిలో దాగివున్న,
దాతృత్వం,వెలుగు చూశాయి
కరోనా రాకతో
సాంఘిక దూరానికి
భౌతిక దూరానికి
అంటరానితనానికి
ఒంటరితనానికి మధ్య తేడా అర్థమైంది
కరోనా రాకతో
ఎంత ఆస్తి వున్నానేమి
ఎన్నికోట్లు వున్ననేమీ
ప్రాణానికి వెల కట్టలేమని
పోయేప్రాణాన్ని నిలబెట్టలేమని
మనిషి ఎంతటి శక్తిమంతుడో
అంతటి బలహీనుడని అర్థమైంది
కరోనా రాకతో
ఒక కఠోర సత్యం బోధపడింది
ఈ నేల మీద ఈ మనిషి జీవితం
ఈ రోజు వెలిగి రేపు ఆరిపోయే దీపమని
నేడు కనబడి మరునాడు రాలిపోయే పువ్వని
ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే నీటిబుడగని....



