Facebook Twitter
ధీర్ఘాయుస్మాన్ భవా!

ఎక్కడో చైనాలో పుట్టి,
ఎందుకే భూమినంతటిని
భూతంలా చుట్టి వేస్తున్నావు
మాఅందరిని మట్టిలోకలిపేందుకా

నీ నోటికి చిక్కిన వారిని
నీ కంటికి కనపడిన వారిని
చిరుతలా చీల్చి వేయమని
అనకొండలా చుట్టివేయమని
కాలసర్పమై కాటువేయమని

ఊరూ వాడా తేడాలేకుండా
పేద ధనిక బేధం లేకుండా
ఎల్లలు లేకుండా అన్ని దేశాలలో
అల్లకల్లోలం సృష్టించమని
సునామీలా దూసుకు రమ్మని
కారుచిచ్చులా చెలరేగి పొమ్మని

కాసింతైనా కనికరం, జాలి లేకుండా
పాపమెరుగని మానవాళిపై, పగతీర్చుకోమని
కసితో ప్రజల్ని కబలించి వేయమని?
సైలెంట్ గా అందరిని సమాధి చేయమని
మౌనంగా ఆ మృత్యువు ఆకలిని తీర్చమని?

ఓసీ కరోనా రాక్షసి ! ఓసీ కరోనా పిశాచి !
ఎవరే అన్నది? ఎవరే నిన్ను కన్నది?
మాయదారి రోగంగా మారమన్నది?

కానీ,ఒక్కటి మాత్రం పచ్చినిజం
షేక్ హ్యాండ్ ఇచ్చిపుచ్చుకున్న
ఇద్దరినీ కరోనా కాటేస్తుంది,
కరెంట్ లా షాక్కొడుతుంది,కాని
చేతులు రెండు జోడించి
నమస్కారం చేసిన వారిని మాత్రం
కరోనా కనికరిస్తుంది, కరుణిస్తుంది,
"దీర్ఘాయువుస్మాన్ భవా" అంటూ దీవిస్తుంది

అందుకే, కరోనాకు మందులేదని
సోకితే మరణమేనని భయపడక
ముందు జాగ్రత్తగా, మందికి దూరంగా వుందాం
ముఖాలకు మాస్కులు వేసుకుందాం
చేతులను శుభ్రంగా కడుక్కుందాం
సోషియల్ డిస్టెన్స్ ను  లాక్ డౌన్ ను పాటిద్దాం
కరోనా విషపు కోరలను విరిచేద్దాం
కరోనా మృత్యువును తరిమి తరిమి కొడదాం