ఈ పుడమి పై పుట్టి గిట్టిన అతి భయంకరమైన
అతి ప్రమాదకరమైన, అతి బాధాకరమైన,
అతి కౄరమైన అన్ని క్రిములలోకన్నా
కంటికి కనిపించని ఈ కరోనా విషక్రిమియే వేరయా
మంచాన పడిన ప్రపంచాన విషం చిమ్ముతూ
వాయువేగంగా విస్తరిస్తూ వేలకొలది ప్రాణాలను
కబలించివేస్తూ కడచూపైనా దక్కనివ్వక
పుట్టెడు దుఃఖాన్ని గుండెళ్ళో కుమ్మరించే
అన్నిక్రిములన్న ఈ కరోనా విషక్రిమియే వేరయా
పున్నమి వెన్నెలను కాళరాత్రిగా,మార్చివేసి
చిరునవ్వులను చీకటి కాన్వాసుల మీద
చితిమంటలుగా చిత్రించే, బ్రతుకులు చిధ్రంచేసే
అన్నిక్రిములకన్నా ఈ కరోనా విషక్రిమియే వేరయా
రక్తసంబంధాల నెన్నింటినో రాత్రికిరాత్రే
రద్దుచేస్తూ ప్రపంచపటం మీద పాములా ప్రాకి
ప్రజల ప్రాణాలను పాయసంలా త్రాగేసే
అన్నివిషక్రిములకన్నాఈ కరోనా విషక్రిమియే వేరయా
కాని,లాక్ డౌన్ రక్షణకవచాన్నిధరించుకుని
స్వీయనియంత్రణ, వ్యక్తిగత శుభ్రత,మాస్కులు,
సమదూరంలాంటి రామబాణాలను సంధించడానికి,
ఈ కరోనా విషక్రిమిని బంధించడానికి
దాని భరతం పట్టడానికి,బొంద పెట్టడానికి
గరుడపురాణంలోని వింత శిక్షలన్నీవిధించడానికి
సంసిద్దంగా ఉన్నది మన భారతదేశయేనయా
ఈ కరోనా విషక్రిమి విరుగుడుకై,ఏడుకొండలెక్కడానికి
కోటి కొబ్బరికాయలు కొట్టడానికి,ఆ కోనేటి రాయుడికి,
మొక్కులుతీర్చుకోవడానికి, అన్ని ప్రపంచదేశాల
ప్రజలకన్నాముందున్నది మన భారతీయులేనయా



