Facebook Twitter
ఓసీ కరోనా రాక్షసి ! ఎందుకే మామీద నీకింత కసి ?

కంటికి కనిపించని
కనికరమేలేని
ఓసీ కరోనా రాక్షసీ
ఎక్కడపుట్టావో ఏమో
ఎలా పుట్టావో ఏమో
ఏమి తింటావో ఏమో
మనుషుల ప్రాణాలను
మాత్రం మింగేస్తున్నావ్
మానవత్వం లేనిదానవు
మనిషికి పుట్టిన దానివి కాదు
ఏ జంతువుకో జన్మించి వుంటావ్
నీకన్నీ మృగలక్షణాలే

నీవు ఏ విమానం ఎక్కక్కర్లేదు
ఏపాస్ పోర్టు నీకక్కర్లేదు
అన్ని దేశాల సరిహద్దులను
ఎదేచ్చగా క్షణాల్లో దాటేస్తున్నావ్
వెయ్యి అణుబాంబులు వేసినా
నాశనం కానంటున్నావ్
నాకు చావేలేదంటున్నావ్
విశ్వమంతా విచ్చలవిడిగా
విస్తరిస్తున్నావ్ వీరవిహారం చేస్తున్నావ్
రెప్పపాటులో మరఫిరంగులతో
యుద్దవిమానాలతో,సబ్ మెరైన్లతో
బాంబుల వర్షం కురిపించి,
ఉగ్రవాద శిబిరాలను
పేల్చి,కూల్చి శత్రుసైన్యాలను
చీల్చిచండాడి మట్టుపెట్టే
అత్యంత శక్తివంతమైన
అగ్రరాజ్యాలనే అల్లాడిస్తున్నావ్
అన్ని దేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్నావ్
ఓసీ కరోనా రాక్షసి !
ఎందుకే మామీద నీకింత కసి?

ఆర్థిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేస్తున్నావ్
చిన్నాపెద్దా ధనికపేదా తేడాలేకుండా
అందరి ముందర మృత్యువై వాలిపోతున్నావ్
నీవు ఎవరికి సోకినా నీవు ఎవరిని తాకినా
వారు పిట్టల్లా రాలిపోతున్నారు
ఎంత మందిని పొట్టన పెట్టుకుంటావే
ఓమాయదారి మహమ్మారి
ఇందరిని బలిగొన్నా
ఇంకా నీ ఆకలి తీరలేదా?
కనిపించిన వారినందరిని
ఎందుకే ఇలా కాటికీడుస్తున్నావ్
నీ రాకతో కుటుంబాలన్నీ
కుదేలుమంటున్నాయ్
కంటిమీద కునుకు లేక తప్పించుకునే
దారిలేక కుమిలి పోతున్నాయ్
రక్తసంబందాలన్నీ
రాత్రికి రాత్రే రద్దైపోతున్నాయ్
ఓసీ కరోనా రాక్షసి !
ఎందుకే మామీద నీకింత కసి?
ఎందుకే మాపై ఇంతగా
విషం గ్రక్కుతున్నావ్
కంటికి కనిపిస్తే కాల్చివేయాలని
మేమంతా ఇంటిదగ్గరే క్కూర్చున్నాం..