Facebook Twitter
ఎందుకు ఎందుకు ఈ ధనదాహం?

ఔరా!
ఇవ్వని మందులకు వేలు ఏల?
చేయని వైద్యానికి లక్షలు ఏల?
చచ్చిన శవాలతో ఈ చీకటి వ్యాపారమేల ?

మనిషి చనిపోయి పుట్టెడు దుఃఖంలో వున్న
కుటుంబసభ్యులను పీడించి పీడించి
కోట్లులక్షలార్జించి  కోటలు ,
విలాసవంతమైన విల్లాలుకట్టనేల ?
ఎంతకాలముండాలని ఈ భూమిపైన,
పోతూపోతూ చేత ఏమి పట్టుకుపోదామని,
ఈ మనిషి ఆరాటం?

అయ్యో దైవమా ఏమిటి ? ఏమిటి?
ఈ మనిషికెందుకు ఇంతటి దురాశ ?
రేపు ఏమి కట్టుకుపోదామని ఈ ధనదాహం?
కన్నవాళ్ళు దూరమైపోయి
కన్నీరు మున్నీరవుతున్నా
ఈ కసాయి గుండెలు కరగవా?
కారుణ్యం చూపువేళ
అయ్యో దైవమా ఏమిటీ కాఠిన్యం?
దైవత్వం చూపు వేళ
అయ్యో దైవమా ఏమిటీ దానవత్వం?

ఏమిటి ఏమిటి ఈ మనిషి అవతారం?
అయ్యో దైవమా ఎందుకు ఇంతటి కౄరత్వం?
ఏమైపోయింది మనిషిలోని మానవత్వం?
ఎందుకు ఎందుకు ఇంతటి ధనదాహం?
ఎంతటి వెర్రితనమో ఈ రోజు అర్థరాత్రి వేళ
ఆ కరోనానే వచ్చి మ్రింగి వేయునేమో మృత్యువై
ఎవరికెరుక ప్రాణం పోసిన ఆ పరమాత్మకు తప్ప