Facebook Twitter
కరోనా వచ్చింది మళ్ళీ…

నిన్న కరోనా వచ్చింది
పెనుమార్పులను తెచ్చింది
ప్రతికన్ను కన్నీరు కార్చింది
ప్రపంచమంతా కలవరపడింది
అందరి కళ్ళను కన్నీటి
సాగరాలుగా మార్చింది
అందరి గుండెల్లో
గునపాలను గుచ్చింది
అందరి బ్రతుకుల్ని బలి తీసుకున్నది
రాత్రికి రాత్రే రక్తసంబంధాలను రద్దుచేసింది
మానవ సంబంధాలను మసిచేసింది
కోటీశ్వరులను సైతం
చాటుమాటుగా కాటువేసింది కబలించివేసింది
అందరినీ కాటికీడ్చింది
కరోనా వచ్చింది
పెనుమార్పులను తెచ్చింది