కష్టం...
మన శత్రువే
ఐనా అతిథిగా
స్వాగతం పలుకుదాం..!
ఎందుకు..? హంసపాలను
నీళ్ళను వేరుచేసినట్లు
కష్టమొచ్చి జల్లెడ పట్టి శత్రువులెవరో...
నిజమైనమిత్రులేవరో తేల్చేస్తుంది...
అంటే కష్టాలు కన్నీళ్లు
రావడం మంచిదేమో...మదనడే
మనసుకింత మందులిస్తాయేమో...
బాధల్ని భరిస్తేనే...
అగ్నిపరీక్షల్ని తట్టుకుంటేనే
దైవం సుఖాలను ప్రసాదిస్తాడేమో...
కష్టాలు వస్తేనే
సూఖాల విలువ తెలిసేది...
గాదములు జల నిధిలో
ఆణిముత్యమున్నట్లే
శోకాల మరుగున దాగి
సుఖ ముందుంటారు
ఎవరు ఆత్మబంధువులో..?
ఎవరు ఆపధ్భాందవులెవరో..?
ఎవరు ఉదార హృదయులో..?
ఎవరు కఠినాత్ములో..?
ఎవరు పరుల కన్నీటికి కరిగిపోతారో..?
ఎవరు ఇతరుల
కష్టాలను చూసి సంబరపడిపోతారో..?
నటించేదెవరో..? నయవంచనకులెవరో..?
ఆప్యాయతతో ఆదుకునే దెవరో..?
ఆపదలోస్తే ముఖం చాటేసే దెవరో..?
గుండెకు హత్తుకునే దెవరో..?
కష్టం కాగడా పట్టి గుర్తుపడుతుంది...
మనకు గుణపాఠాలను నేర్పుతుంది...
అందుకే ఓ నా నేస్తం..
కష్టాలు కన్నీళ్లు వస్తే రానియ్...
సుఖాలు మాయమైపోతే పోనియ్...
మబ్బులో దాగిన సూర్యుడు
మళ్ళీ వెలుగు నిచ్చునట..
నేడు కష్టపడి కన్నీళ్లు కారిస్తే
రేపు సుఖ సంతోషాల
సాగరాన ఈదులాడవచ్చునట...
కష్ట సుఖాలు కావడి కుండలేనట...
ఒకటి ముందు ఒకటి వెనుకేనట....
అసలీ బ్రతుకే ఒక బూటకమట.....
ఆ భగవంతుడు ఆడే జగన్నాటకమట...
