Facebook Twitter
నా శతక రచన నా నివేదన

నేపలికేను...శుభాల
నొసగేటి సుమధుర
సుందర సుభాషితం... 
చిలికేను...అమృతం...
కులికేను...ప్రతిహృదయం...
వెన్నెలై వెలిగేను...ప్రతిజీవితం...

మనిషి
మనుగడను...మార్చేవి...
నీతిని బ్రతుకున...నింపేవి...
మనశ్శాంతిని...ప్రసాదించేవి...
మానవత్వాన్ని...ప్రభోదించేవి...
నా ఈ సుందర సుభాషితాలు

అందుకే ఓ శ్రీరామచంద్రా..! 
"సుభాషితాలు సూర్య కిరణాలు"
అను నా ఈ శతక కృతిని..


నిండూనూరేళ్లు వర్థిల్లేలా..!
దీవించుమయ్యా..! ఓ దివ్యచరితా..!

అనంతమైన అర్థాలతో...
పసందైన పద్యాలతో...
ఆటంబాంబులాంటి
ఆటవెలదులతో...
సమాజంలోని
దురాచారాలను...
సమాధి చేసి...
వెన్నెల వానలు
కురిపించిన...
వేమన్న సూక్తులే...
ఈ పోలన్నకవికి స్పూర్తి...

కోరి నేనే
కీర్తి కిరీటాన్ని...
బంగారు పతకాన్ని...
వ్రాయలేదీ శుభాల
నొసగే సుభాషితాల్ని...
కోరేదొక్కటే కలనైన
కనిపిస్తే ఆ దైవాన్ని...
కుల...మత...రహిత...
శాంతియుత...సమాజాన్ని...