పోరాటపటిమతో నిత్యం పోరుబాటలో
ముందుకుసాగే నేటి నవనాగరిక జీవితయాత్రలో
లయ తప్పని శృతిరాగం వినిపిస్తూ
కమ్మని కవనగీతికలు లిఖిస్తూ జుంటితేనెల
*తియ్యదనంలా మధుర గీతాలాలపిస్తూ
సుమధుర భావనలు పలికిస్తూ
*కమనీయ తలపుల కావ్యగ్రంథమై
ఉదయవేదికతో మధుర బంధమై
*వినతులెల్లను చిరునవ్వుతో స్వీకరించే
స్నేహహస్తమై, చెలిమికి నేస్తమై
*కూనలమ్మ సుస్వరములా
రసరమ్య కవితాగీతికల మధురరాగమై
*కలం కరవాలంగా చేబూని
అనునిత్యం ఆటుపో
*ట్లబ్రతుకు బాటలో
సమకాలీన సామాజిక సమస్యలపై
*పదునైన పదజాలంతో
తన వాణిని వినిపిస్తూ
సందేశాత్మక కవితల
*ల్లివెన్నెల జల్లులు కురిపిస్తూ
పాఠకలోకాన్ని నిత్యం పరవశింపజేసే
మధురకవి పోలయ్య కవి కూకట్లపల్లి కి
వందనం ! అభివందనం ! సాహితీ వందనం !!
ఇట్లు...
మీ అభిమాని మీశ్రేయోభిలాషి
మీ ఆత్మీయ సాహితీ మిత్రుడు
సిహెచ్ రవి కుమార్ వుయ్యూరు
కృష్ణాజిల్లా...ఆంధ్ర ప్రదేశ్...9494052581



