నీ ప్రాణ మిత్రులైనా...
నీ బద్ద శత్రువులైనా...
విభేదాలు చెలరేగి
వివాదాలు ముదిరి
నీవు తిట్టిన తిట్లు
పెట్టిన శాపనార్థాలు...
మరుక్షణమే మరిచి పోవచ్చు...
అందుకే నరుడా ఓ నరుడా..!
వాస్తవం ఎరగరా వానరుడా..!
నీ ప్రాణ మిత్రులకైనా...
నీ బద్ద శత్రువులకైనా...
ఆకలి గొంటే అన్నం పెట్టినా...
దప్పిక కొంటే దాహం తీర్చినా...
చలికి వణికితే దుస్తులిచ్చినా...
ఆపదంటే ఆసుపత్రిలోఉంటే
ఆర్థికంగా అన్నలా ఆదుకొన్న
నీవు అవసరాల్ని తీర్చిన నీవు...
అప్పటికి ఆపద్భాంధవుడవే..!
కాళ్ళకు మ్రొక్కేటి కనిపించేటి
కరుణించేటి ప్రత్యక్ష దైవానివే..!
అట్టి నీ గట్టి మేలును వారు
మరుక్షణమే మరిచిపోవచ్చు
ఆపై నీవిక భయంకర భూతానివే..!
అందుకే నరుడా ఓ నరుడా..!
వాస్తవం ఎరగరా వానరుడా..!
నీ ప్రాణ మిత్రులకైనా...
నీ బద్ద శత్రువులకైనా...
ఏ విధి లిఖితమో ఏమో
ఏదైనా ఓ విషఘడియలో
నీవు "నోటమాట" జారితే...
వారి మనసులు గాయపడితే...
వారు మానసికంగా
శిలువ శిక్షకు గురైతే...
గుండెల్లో మేకులు దిగితే...
కన్నీటి చుక్కలు నేలరాలితే...
కలిగే...
ఆ బాధను...
ఆ వ్యధను...
ఆ వేదనను...
ఆ మానసిక క్షోభను......వారు
మరణించే వరకు మరిచిపోరు
అందుకే నరుడా ఓ నరుడా..!
వాస్తవం ఎరగరా వానరుడా..!



