Facebook Twitter
ఇదేమి వింత నైజం నేస్తమా

నీవు వెయ్యితప్పులు చేసినా
నిన్ను నీవు పొగుడుకుంటావు ప్రేమించుకుంటావు...
నిట్టుర్చవు...నిందించుకోవు...

కానీ ఎదుటివాడు
ఒక్క తప్పు చేస్తే చాలు...
క్షమించలేవు
సహించలేవు 
శిక్షించడానికి
కఠినంగా సిద్దమౌతావు

ఇదేమి నైజం మానవా..!
ఇకనైనా నీవు మారవా..?

తలకు మించి
ఊరినిండా అప్పులు చేసి
తీర్చలేక తిప్పలు పడుతున్నా
అప్పులు కుప్పలున్నా
నీవు మాత్రం అగర్భశ్రీమంతుడవే...

కానీ పేదవాడి పెళ్ళికి
డిజే లేదని...
సూటుబూటు లేదని...
గుర్రం మీద ఊరేగలేదని...

భూదేవి అంత పీట
ఆకాశమంత పందిరి
వేయలేదని వెక్కిరింతలా..?

ఇదేమి నైజం మానవా..!
ఇకనైనా నీవు మారవా..?