Facebook Twitter
కన్నబిడ్డలే కసాయివాళ్ళైతే..?

కన్న వాళ్ళకింత
తిండి పెట్టక కసురుకునేవారు...
చీటికి మాటికి కాటికి పొమ్మని...చీదరించుకొనేవారు...

జాలి...దయా...కరుణా
కనికరమన్నదే లేక...ఇన్ని
పచ్చడి మెతుకులు పెట్టకపోగా
పచ్చిబూతులు తిట్టేవాళ్ళు...
కర్రలతో కొట్టేవాళ్ళు...
వాతలు పెట్టేవాళ్ళు...
కష్టపడి ఆర్జించిన
ఆస్తుల్ని పంచివ్వమని
పిశాచుల్లా...పీడించేవాళ్ళు...
పీకలు పిసికే వాళ్ళు...
పిచ్చికుక్కల్లా అరిచే కరిచేవాళ్ళు...

వయసుడిగిన అమ్మానాన్నలు నేడోరేపో నేల రాలిపోయే పెరటిలో మొక్కలంటూ...
ఏ దిక్కూమొక్కూలేకుండా ఏ మూలనో
పడి మూలిగే ముసలి నక్కలంటూ...

లక్షల కోట్ల ఆస్తులు
ప్రేమతో పంచిన....
అమ్మానాన్నలను...
ఏమీలేని అనాధలుగా...
ఆకలికి...
అలమటించే
అస్థపంజరాలుగా....మార్చేవాళ్ళు
అనాధాశ్రమాలలో...చేర్చేవాళ్ళు
కసాయివాళ్ళే..?
కరుడు కట్టిన శాడిస్టులే కదా...
అట్టి కృతజ్ఞతలేని‌ ఆ కన్నబిడ్డల కన్న
విశ్వాసంగల ఆ వీధి కుక్కలే నయం...