Facebook Twitter
పచ్చని సంసారానికి పది" సూత్రాలు

1.
వాదించుకోండి
కాని వాదనలో గెలిచేది ఒక్కరేనని తెలుసుకోండి. వేదన  వ్యధ మాత్రం యెదలో మిగిలి పోతుందని బ్రతుకు రగిలిపోతుందని మాత్రం మరిచిపోకండి.

2.
ప్రేమతో తిట్టుకోండి
కాని కోపంతో కొట్టుకోకండి.
ఒకరిని ఒకరు బజారులోనికి నెట్టుకోకండి.

3.
గతాన్ని త్రవ్వుకోకండి.
గందరగోళంలో అంధకారంలో పడకండి.

4.
ఈ జగతిలో ఉన్నది
మనమిద్దరమే అనుకొని
హత్తుకుపోవాలి ఒకరినొకరు ఎత్తుకొని ఇల్లంతా తిరగాలి. అప్పుడు మనసెంతో
హాయిగా వుంటుంది. నామాట నమ్మండి.

5.
ఇద్దరి మధ్య అపార్ధాలనే
అగ్గి రగిలితే ఆ నిప్పును
చల్లర్చకుండా ఎప్పుడూ నిద్ర పోకండి.

6.
అన్నింటికీ స్పందించండి.
ఒకరికొకరు ఎప్పుడో ఒకప్పుడో
ఏదో ఒక స్పెషల్ డే సందర్భంగా
ఒక సప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిపుచ్చుకోండి. అభినందించుకొండి గట్టిగా ఆలింగనం చేసుకోండి. ఆత్మకు తృప్తిగా వుంటుంది అనురాగం చిగురులు తొడుగుతుంది

7.
ఎవరైనా తప్పుచేస్తే ముందు
ఒప్పుకోండి మూర్ఖత్వానికి...
మొండితనానికి ముసుగు కప్పుకోండి

8.
ఎదకు తగిలిన
మానని గాయాలు మిగిలివున్న
తీపి జ్ఞాపకాలను మింగివేస్తాయి
అందుకే అంటారు ముఖాముఖి
చర్చలు మనస్పర్దలకు మందులని...
అవి తెలియని ఆలుమగలు అంధులని...

9.
మీరిద్దరే ఏకాంతంగా చర్చించుకోండి.
మీ సమస్యల్ని మీరే పరిష్కరించుకోండి. మీ ఇద్దరికి మధ్య మూడోవ్యక్తి ఎంటరైతే ముప్పేనని అది ఖచ్చితంగా మీ పచ్చని
కాపురానికి ఒక ఆరనిచిచ్చని గ్రహించండి

10.
భర్తకు భార్య భార్యకు భర్త
భగవంతుడు అందించిన బంగారు వరమని భావించండి. భగవంతున్ని నిత్యం ప్రార్ధించండి. ఆ భగవంతుడే తోడుంటే బాధలన్నవేవీ ఇక వుండవు.

అప్పుడు అంతటా అంటే...
మదినిండా...ప్రశాంతతే...
పడకగది నిండా...
పకపక నవ్వులే...
నవ్వుల పువ్వులే...
ఆ సంసారం...
సుఖసంతోషాల సాగరమే...
ఆ దంపతులు ఆ దైవం
దీవించిన పుణ్యదంపతులే
వారు అందరికి ఆదర్శమే...