కాలం ఒక ఇంద్రజాలం
మనిషి కూడా ప్రొద్దున్నే
నిద్ర లేచింది మొదలు రాత్రి
పడుకునే వరకు గుడ్డిగుర్రంలా
పరుగులు తీస్తూనే ఉంటాడు
పనిలేని సోమరికి కాలం గడవదు
పనిచేసే శ్రమజీవికి కాలం తెలియదు
బిక్షగాడికైనా బిల్ గేట్స్ కైనా
సామాన్యుడికైనా సామ్రాజ్యాల
నేలే చక్రవర్తులకైనా ఆ పరమాత్మ
ప్రసాదించిన సమయం 24 గంటలే
కాలాన్ని ప్రణాళిక
బద్దంగా సద్వినియోగం
చేసుకునే మేధావులకు
కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది
కానీ కాలాన్ని కాలదన్నే వారిని
కాలమే ఒక కాలసర్పమై కాటువేస్తుంది



