గుండె పోటు...విధి కాటు
ఖర్మకాలి అకస్మాత్తుగా
ఆ మాయదారి జబ్బేవస్తే
అందరూ గుండెలు బాదుకొని...
దిక్కులు పిక్కటిల్లేలా...
వెక్కివెక్కి ఏడవడం తప్ప...
ఏమీ చేయలేని దీనస్థితిలో
దిక్కులు చూస్తూ ఉండిపోతారు...
అందుకే ఎప్పుడైనా...
రోజుకు ఒక్కసారైనా...
మనకు జన్మనిచ్చిన అమ్మను...
మనకు ప్రాణం పోసిన బ్రహ్మను...
ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి...
సదా మనసులో స్మరించుకోవాలి...
ఊహించకనే వచ్చే
కష్టాలను నుండి...తప్పించమని...
పెనుప్రమాదాలనుండి...రక్షించమని...
కరుణించమని కంటికిరెప్పలా కాపాడమని..
అడుగడుగునా గండాల నుండి...
సుడిగుండాల నుండి...
చుట్టుముట్టి మట్టుపెట్టే...
భయంకరమైన సునామీల నుండి...
సురక్షితంగా బయట పడవేయమని...
పదికాలాల పాటు పిల్లాజల్లతో
కలిసి హాయిగా చల్లగా ఆనందంగా
సంతోషంగా ఉండేలా చూడమని...
ఆశతో అర్థించాలి...పేరాశతో ప్రార్థించాలి



