Facebook Twitter
అంతరాత్మ ప్రబోధం..?

నాలోని బలహీనత కన్నా...
నా భగవంతుని బలమే మిన్న...

నిత్యం నన్ను వేధించే బాధించే
నా సమస్య నా కన్నా పెద్దదే కావొచ్చు
ఒక భయంకరమైన భూతంలా కంటికి
కనిపించవచ్చు‌ నన్ను కలవరపెట్టవచ్చు...

ఏ చిక్కుసమస్య
నా దైవం కన్న పెద్దది కానేరదు
నా భగవంతుడు
పరిష్కారించలేనంత క్లిష్టమైనదీ కాదు

అందుకే సమస్యల సృష్టికర్త సైతానైతే...
సమస్యల పరిష్కార కర్త ఆ పరమాత్మే...

నేను ఎన్ని సమస్యల సుడిగుండాలలో

చిక్కుకున్ననేమి..? కాపాడే సమర్ధుడు...
సర్వశక్తిమంతుడైన నా దైవముండగా...

నా తప్పిదాల
నా ఓటమి కన్న
నా దైవం ఓదార్పే మిన్న...
నా కంటి కన్నీటి ధారలకన్న
నా దైవం నాపై కురిపించే ఆ కరుణేమిన్న...

నాకు నా "అంతరాత్మ ప్రబోధం"
ఒక్కటే ఎవరికెన్ని రహస్యాలు చెప్పినా
మనలోని..."బలహీనతల్ని"...మనం
ఇతరులకు బహిర్గతం చేయరాదని...

చేసిన మరుక్షణం
ఈ సమాజం మనల్ని
ప్రశాంతంగా బ్రతకనివ్వదని...
మనల్ని చూసి నవ్వుతోందని...
మనకు నరకం చూపిస్తుందని...
మనల్ని వేధించి వెలివేస్తుందని...
మనకు సమాధిని సిద్దం చేస్తుందని...