Facebook Twitter
నరరూప రాక్షసులు???✓

మొన్న గోడమీద
భయపడుతూ తిరిగిన
బల్లి...నిన్న ఢిల్లీ కెళ్ళింది...నేడది
భయపడే కంగారుపడే బల్లి కాదు
బలిసి మిళమిళమెరిసే...బంగారు బల్లి"

మొన్న కళ్ళు మూసుకొని పాలు
త్రాగిన పిల్లి... నిన్న ఢిల్లీ కెళ్ళింది
నేడది గాండ్రించే పిల్లి కాదు..."గర్జించే పులి"

మొన్న నక్కినక్కి తిరిగిన
నల్లి...నిన్న ఢిల్లీ కెళ్ళింది
నేడది...రాతృల్లో రక్తం త్రాగే నల్లి కాదు
క్షణక్షణం రంగులు మార్చే..."ఊసరవెల్లి"

ఆ బల్లి... ఆ పిల్లి...ఆ నల్లి
ఊసరవెల్లులకు
నరరూప రాక్షసులకు ప్రతిరూపాలు
పబ్లిక్ గా ప్రజాసేవ సాక్షిగా
అవినీతి కార్యకలాపాల్లో ఆరితేరి
ఆడపడుచుల శీలాలతో ఆడుకునే
ఆ ఆటగాళ్ళను...ఆ వేటగాళ్ళను
ఆ అంధులను...ఆ కామాంధులను

నడిబజార్లో ఉరికంబానికి
వేలాడదీసినట్లు... ఉరితీసినట్లు...
గుండెకు గురిచూసి ఏకే-47తో పేల్చినట్లు...
నిట్టనిలువునా చీలినట్లు... పిట్టల్లా కాల్చినట్లు...
కన్నెపిల్లలందరూ  కమ్మని కలలు కంటూవుంటే...
నిర్భయ చట్టం సాక్షిగా ఆ కలలు సాకారమైనవేళ
ఆడపడుచుల గుండెల్లో అంతులేని ఆనందహేళ