Facebook Twitter
గానమా..! నా ప్రాణమా...!!

గానం...
ఎప్పుడూ మధురమే
గానం...
ఎప్పుడూ గంభీరమే...
గానం...
ఎప్పుడూ గలగలా
ప్రవహించే గంగా ప్రవాహమే...

గానం...
చెవులకు చక్కెరే...
మానని గాయాలకు మందే...

గానం...
ఎప్పుడు విన్నా
వీనులకు విందే
మనసుకు పసందే...
గానం...
ఎప్పుడు విన్నా
గుండెల్లో విరిసే హరివిల్లే...
మదిలో కురిసే చిరుజల్లే...

గానమే...
మన ప్రాణమైతే
ఈ లోకం ఒక స్వర్గలోకమే...
గానం...
గాయకునికి కంఠాభరణమే
శ్రోతలకు తియ్యనితేనెల విందే...

గానం...
మత్తెక్కిస్తుంది
మైమరపిస్తుంది
ఉల్లాసంతో ఉత్సాహంతో
ఉరకలు వేయిస్తుంది
మనసును ఉయ్యాల లూగిస్తుంది అంతరంగాన అమృతం కురిపిస్తుంది