Facebook Twitter
కాపురం లో కారుచిచ్చు రేగితే...?

కనులున్నాక...కలలు తప్పవని...
కడలి అన్నాక...అలలు తప్పవని...
కాపురమన్నాక...కలతలు తప్పవని...
కన్నీళ్లు కలహాలులేని కాపురాలే లేవని...

"లాగు లాగు తెగేదాకా వేస్తే ఆగు"
అన్న "సంసారసూత్రాన్ని" ప్రతినిత్యం
ఇద్దరూ గాయత్రిమంత్రంలా జపించాలని...

ముఖాముఖి చర్చలే
మనస్పర్థలకు... మందులు...
ఆ లౌక్యం ఎరుగని
ఆలూమగలిద్దరూ అంధులు ...
అన్న "జీవన సత్యాన్ని" గ్రహించాలని...

వివాదం ముదిరి విడిపోతే విషాదమని...
ఇద్దరు కలిసి ఉంటేనే  కలదు సుఖమని...
సఖ్యత ఉన్న సంసారమే ఒక స్వర్గసీమని...
జగడాలులేని జంటలే అందరికీ ఆదర్శమని

తక్షణమే దంపతులిద్దరూ తెలుసుకోవాలి...
కలిసి కలకాలం బ్రతకాలి నూరేళ్లు వర్ధిల్లాలి.