నేడు
ఆఫ్గనిస్తాన్
భగభగమండే
ఒక అగ్నిగుండం
రాబందులు
రాక్షసమూకలు
రాజ్యమేలుతున్నాయచట
రక్తం ఏరులై పారుతుందచట
ప్రేమ దయ జాలి కరుణ
శాంతి సమాధానం మతసామరస్యం
ప్రజాస్వామ్యమను పదాలు నిషేధమచట
కక్షలు కార్పణ్యాలతో
పగలు ప్రతీకారాలతో
కుట్రలు కుతంత్రాలతో
అసూయా ద్వేషాలతో
అధికార దాహంతో నిత్యం నరమేధమేనచట
మంచితనం మానవత్వం
మచ్చుకైనా కనిపించదచట
మానవీయ విలువలు మట్టి కరిచాయచట
కఠినమైన కట్టుబాట్లతో కళ్ళకుగంతలే నచట
క్రూరత్వం కుటిలత్వం మూర్ఖత్వమే ముద్దు అచట
భయంతో కాపరి పారిపోగ నిత్యం మరఫిరంగుల మ్రోతచట
గొర్రెలమందల్లో చొరబడిన తోడేళ్ళవిచ్చలవిడి వీరంగమచట
ప్రజలు పగబట్టిన పాములు
చుట్టుముట్టిన కప్పలే అచట
పులులవేటలో ప్రాణభయంతో
పరుగులుతీసే జింకపిల్లలేనచట
మానవ మృగాల మతోన్మాదుల కామాంధుల
రక్తంత్రాగే రాక్షసుల వికృత పాలనలో మహిళలకు రక్షణ లేదచట
చోద్యం చూడక ప్రపంచదేశాలన్నీ ఏకమై
ఈ నరరూప రాక్షసుల అరాచకాలను అక్రమాలను
ఆగడాలను కఠినమైన ఆర్థికఆంక్షలతో కట్టడి చేయాలి
ఈ ఘోర నరమేధాన్ని ఆపాలి ఆత్మబంధువులై ఆదుకోవాలి
రాజ్యకాంక్షతో రెచ్చిపోతూ అమాయకపు ప్రజల రక్తంత్రాగే
ఆ రాక్షసమూకలకు తక్షణమే తగిన గుణపాఠం నేర్పాలి
ఆఫ్గనిస్తాన్ ప్రజలకు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను ప్రసాదించాలి



