తరతరాల భారతీయ
వారసత్వ సంపదను
"పంచామృతంలా" ప్రపంచానికి
పంచాలన్న సత్సంకల్పంతో
2014లో ఐక్యరాజ్యసమితిలో
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
ప్రవేశ పెట్టిన తీర్మానం
193 దేశాధినేతలలో
175 మంది అంగీకారంతో
2015 జూన్ 21 నుండి
"అంతర్జాతీయ యోగా దినోత్సవంగా"
విశ్వవ్యాప్తమాయె...నేడు
భారత్ "విశ్వయోగ గురువాయె"...
అత్యంత పొడవైన జనవరి 21వ తేదీన
ప్రతిఏటా చేసే"యోగ"ఓ దివ్యఔషధమాయె
తల్లి జన్మనిస్తే...
"యోగ" పునర్జన్మనిస్తుంది...
అది "ఒత్తిడిని" చిత్తు చేస్తుంది...
"ఆందోళనను జయించేలా చేస్తుంది...
"యోగ" అమోఘమైన "మేధాశక్తిని"...
అనంతమైన "ఆత్మశక్తిని"అందిస్తుంది...
అనునిత్యం శ్రద్ధతో...
వేసే యోగాసనాలు...చేసే ప్రాణాయామం...
ధ్యానం...సూర్య నమస్కారాలు...
మానని "మొండిరోగాలకు"మందులే...
"యోగాతో" శరీరం "సేద"తీరుతుంది...
"మదిలో "ప్రశాంతత నది" ప్రవహిస్తుంది
"అష్టైశ్వర్యాలున్ననేమి" ?
"ఆరోగ్యం" లేకున్న అన్నీ సున్నే...
మనిషిని అత్యున్నత స్థితికి చేర్చి
"ఆయుషును" పెంచేది "యోగాసనమే"
అందని ఆనందానికి "యోగ"ఓ ఆయుధమే
అందరి సంపూర్ణ ఆరోగ్యానికిది ఓ ఔషధమే
నిత్యం క్రమశిక్షణతో
"యోగగురువు" పర్యవేక్షణలో
"యోగాసనాలు" వేసేవారంతా....
ఆరోగ్యవంతులే...అదృష్టవంతులే...
ఆదర్శవంతులే....అపర శ్రీమంతులే...
చిరంజీవులే........చిరస్మరణీయున్తలే...
వారంతా............ధీర్ఘాయుష్మంతులే...
"స్వర్గానికి మార్గం" తెలిసినవారే...



