Facebook Twitter
అందించండి ఆక్సిజన్..!

కొందరికి షేర్ చేసిన కవితాసందేశాలు
చిల్లికుండలో పోసినట్టి పాలౌతున్నాయి
చదివి సమయమున్నా స్పందించకున్నారు
తమ ఆనందాన్ని షేర్ చేయలేకున్నారు

నీరు పోస్తేనేగా...ఏ మొక్కైనా ఎదిగేది...
తల్లిపాలు పడితేనేగా...ఏ బిడ్డైనా పెరిగేది
కాస్త మెచ్చుకోలు ప్రోత్సాహముంటేనేగా...
ఏ కలమైనా కదిలి కవితలు కళ్ళు తెరిచేది

కాస్త ప్రోత్సాహిస్తే ఖర్చేముంది? చెప్పండి
కొన్ని కలాలకు...ఆక్సిజన్ అందడం తప్ప
ఆకలితోవున్న అనాధలకింత అన్నంపెడితే
పోయేదేముందింత పుణ్యం రావడం తప్ప