అన్న! పోలయ్య కవికి! వందనం!
తేటగీతి:
నలుగురికి పంచినావయ్య నగ్న సత్య
ములను వేమన కవివోలె, ఉత్తమ కవి
వీవు పోలయ్య నాఅన్న, నీదు కవిత
చదివినంతనే మనసులు సేద తీరు
తేటగీతి:
నా మనసును దోచిన కవి, నాహృదయము
నందు నిలిచిన కవీవీవు, మధురమైన
సూక్తులు సుభాషితాలన్ని సుందరమైన
భావములుగల కవితలు పండితుండా!
తేటగీతి:
అచ్చ తెలుగు కవివిమీరు, స్వచ్ఛమైన
భావములు గల కవితలు పంచుతున్న
కవివరా నీకు వందనం, కమ్మనైన
కవితలను పంచు అద్భుత కవివి మీరు!



