మంచి సమాచారం …
కొందరికి అందినా ,చేరినా,
తెలిసినా, స్పందించరు
మరొకరి చెవిలో వెయ్యరు
ఎవరికీ చెప్పరు
అసలు అటువంటి
విలువైన సమాచారం
అందక, తెలియక,
వాళ్ళ చెంతకు చేరక,
ఏమి చెయ్యాలో,
ఎవరిని, అడగాలో తెలియక
చాల బాధపడుతూ వుంటారు కొందరు
అంటే సమాచారం అందిన కొందరు
దాన్ని సద్వినియోగం చేసుకోరు
సద్వినియోగం చేసుకునే వారికి
ఆ సమాచారం సరైన సమయానికి అందదు
అంతా ప్రాప్తం ఇది ముమ్మాటికీ నిజం



